Reading Time: < 1 minute

కొత్తగూడెం, జనవరి 23,2026:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వార్త తరంగాలు జాతీయ దినపత్రిక 2026 సంవత్సర నూతన క్యాలెండర్‌ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమాన్ని వార్త తరంగాలు స్టాప్ రిపోర్టర్ రత్నకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ, వార్త తరంగాలు పత్రిక ప్రజలకు–ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ, నిష్పక్షపాతమైన వార్తలను నాణ్యమైన కథనాల రూపంలో అందిస్తూ మంచి గుర్తింపు పొందిందని అన్నారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వార్త తరంగాలు యాజమాన్యానికి, స్టాప్ రిపోర్టర్ రత్నకుమార్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా మహిళా నాయకురాలు కరిష్మా రత్నకుమారి, అంబేద్కర్ నగర్ మాజీ సర్పంచ్ జగదాంబ, శ్రీనగర్ మాజీ ఉపసర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.