తెలంగాణలో డీజిల్ కొరత ఉందన్న వార్తలను సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా సజావుగా కొనసాగుతోందని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. సోమవారం ఒక్కరోజే 7,443 కిలోలీటర్ల పెట్రోల్, 11,081 కిలోలీటర్ల డీజిల్ సరఫరా జరిగి, మొత్తం 18,524 కిలోలీటర్ల ఇంధనం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ఆయిల్ కంపెనీలతో చర్చలు జరిపిన మంత్రి, అన్ని పెట్రోల్ బంకులకు నిరంతర సరఫరా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్ నేపథ్యంలో డీజిల్ సరఫరా కీలకమని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో హార్వెస్టర్లు, వ్యవసాయ యంత్రాలకు అవసరమైన డీజిల్‌ను ప్రత్యేకంగా అందించాలంటూ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణ కోసం అధికారులను నియమించారు.
ఇతర రాష్ట్రాల నుంచి ఇంధనం నింపుకోవడానికి వచ్చే వాహనాలపై నియంత్రణ విధించాలని కూడా సూచించారు. కొందరు డీలర్లు ధరలు పెరుగుతాయన్న అంచనాతో ఇంధనాన్ని నిల్వ చేసుకుంటున్నారన్న అనుమానాలపై ఆయిల్ కంపెనీలు స్పందించాయి. అన్ని ఔట్లెట్లు ఆటోమేషన్‌లో ఉండటంతో స్టాక్, లావాదేవీలపై నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని వెల్లడించాయి.
ఇక సివిల్ సప్లయ్స్ కమిషనర్ Stephen Ravindra కూడా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అవసరమైనంత ఇంధనం అందుబాటులో ఉందని, ఎవరూ అక్రమంగా నిల్వ చేసుకోవద్దని హెచ్చరించారు.
ఇంధన కొరతను కృత్రిమంగా సృష్టించే ప్రయత్నాలు చేసినా, నిల్వలు దాచిపెట్టినా, పుకార్లు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే హెల్ప్‌లైన్ నంబర్ 1967కు సమాచారం ఇవ్వాలని కోరారు.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









