విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రయాణంలో ఉన్న ఓ వివాహితపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన రైల్వే భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం…, పల్నాడు జిల్లా రెంటచింతల ప్రాంతానికి చెందిన దంపతులు జీవనోపాధి కోసం విశాఖపట్నంలో నివసిస్తున్నారు. ఒక కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు విశాఖ ఎక్స్ప్రెస్లో ప్రయాణం ప్రారంభించారు. రైలు గుడివాడ – విజయవాడ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఏసీ బోగీలో ఖాళీ ఉందని చెప్పి గుర్తుతెలియని వ్యక్తి మహిళను తన వెంట తీసుకెళ్లాడు. ఈ సమయంలో ఆమె భర్త వేరే చోట కూర్చుని ఉండగా, మహిళను హెచ్1ఏ బోగీలోని కూపేలోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ కూపే తలుపులు మూసి ఆమెపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటన తర్వాత బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురైనట్లు సమాచారం. నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడా లేదా అన్న విషయంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రైలు నడికుడి ప్రాంతానికి చేరుకున్న తర్వాత మహిళ తన భర్తకు విషయం తెలిపింది. అనంతరం రెంటచింతలకు చేరుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును సంబంధిత రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ ఘటనతో రైల్వే ప్రయాణ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









