Reading Time: < 1 minute

విడాకుల అనంతరం భరణం కోరడం సాధారణమే కానీ, చైనాలో చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనతో బ్రేకప్ చెప్పిన ప్రియురాలి నుంచి తాను ఖర్చు చేసిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఓ యువకుడు కోర్టును ఆశ్రయించాడు.

ఆమె ఎక్కువగా తినేదని, కలిసి ఉన్న సమయంలో ఆహారం తదితర అవసరాల కోసం సుమారు 30 వేల యువాన్లు ఖర్చయ్యాయని అతడు వాదించాడు.

ఒకే గ్రామానికి చెందిన వీరికి మాట్రిమొని వెబ్‌సైట్ ద్వారా పరిచయం ఏర్పడి, కొంతకాలం డేటింగ్ తర్వాత పెళ్లికి సిద్ధమయ్యారు. సంప్రదాయం ప్రకారం వధువుకు 20 వేల యువాన్లు ‘బ్రైడ్ ప్రైస్’గా ఇచ్చారు.

అయితే విభేదాలతో పెళ్లి రద్దైంది. కేసు విచారించిన కోర్టు, ప్రేమలో చేసిన ఖర్చులు తిరిగి కోరడం సరికాదని పేర్కొని యువకుడి పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే బ్రైడ్ ప్రైస్‌లో సగం మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ప్రియురాలిని ఆదేశించింది.