రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో పొడి వాతావరణం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ కాలంలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుంచి 3°C వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది.
చలి కారణంగా ఉదయపు వేళల్లో ప్రజలు స్వెటర్లు, మంకీ క్యాప్‌లతో బయటకు వస్తుండగా, దట్టమైన పొగమంచు వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









