class="wp-singular post-template-default single single-post postid-261 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

నల్లమల అటవీ ప్రాంతంలో జింకలను వేటాడి, వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి హైదరాబాద్‌కు తరలించి కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్న నిందితుడిని పోలీసులు గుర్తించారు.

రాజేంద్రనగర్ SOT పోలీసులు అతడిని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 2025లోనూ హైదరాబాద్‌లో జింక మాంసం పట్టుబడి కలకలం రేపిన విషయం తెలిసిందే.

టోలిచౌకిలో 10 కిలోల జింక మాంసం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జహీరాబాద్ ఫారెస్ట్ ఏరియా నుంచి మాంసం తీసుకొచ్చినట్టు విచారణలో వెల్లడైంది. వారి వద్ద జింక కొమ్ములు, లైసెన్స్ ఉన్న రైఫిల్స్, బొలెరో వాహనం సీజ్ చేసి, వన్యప్రాణి రక్షణ చట్టం, 1972 కింద కేసు నమోదు చేశారు.