class="wp-singular post-template-default single single-post postid-276 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2 నుంచి 8 వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానాలు అదనపు సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు.

శుక్రవారం ఉదయం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. జనవరి 1 సాయంత్రం నుంచే భారీగా భక్తులు తరలివస్తుండగా, అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు చెప్పారు. క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు నిరంతరం అందిస్తున్నామని తెలిపారు. అధిక రద్దీ నేపథ్యంలో భక్తులు అధికారుల సూచనలు పాటించాలని కోరారు.