class="wp-singular post-template-default single single-post postid-298 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డా. ఇ. నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలకు జనవరి 10 నుంచి 16 వరకు వరుసగా సంక్రాంతి సెలవులు ఉంటాయి. జనవరి 17 శనివారం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆరు రోజులు సెలవులు ఉన్నప్పటికీ, కనుమ పండుగ దృష్ట్యా జనవరి 16న అదనపు సెలవు ప్రకటించారు. దీంతో మొత్తం ఏడు రోజుల సెలవులు లభించాయి.

ఈ ఉత్తర్వులు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పండుగకు సొంతూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించింది.