Reading Time: < 1 minute

వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేయడాన్ని ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది వెనిజువెలా సార్వభౌమాధికారంపై జరిగిన ఘోర దాడి అని కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం విమర్శించింది.

అమెరికా ఆధిపత్య ధోరణి మరోసారి బయటపడిందని ఉత్తర కొరియా అధికారిక మీడియా వ్యాఖ్యానించింది. వాషింగ్టన్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ, అందుకే అణు, క్షిపణి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది.

అమెరికా ప్రత్యేక దళాలు వెనిజువెలా రాజధాని కారకాస్ లో వైమానిక దాడులు చేసి మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని న్యూయార్క్ కు తరలించినట్లు తెలిపింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కేసుల్లో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తున్న అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని ఉత్తర కొరియా పిలుపునిచ్చింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ ఉద్రిక్తతలకు దారి తీయవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.