class="wp-singular post-template-default single single-post postid-354 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

మేడారం జాతర–2026ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పటిష్టమైన, విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. సోలోమన్ తెలిపారు.

బుధవారం సాయంత్రం నిర్వహించిన ఆర్టీసీ మేడారం జాతర సమీక్ష సమావేశంలో ఆయనతో పాటు రీజనల్ మేనేజర్ దర్శనం విజయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ రీజియన్ల నుంచి వచ్చే బస్సుల ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

మేడారం జాతరకు లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అంతరాయం లేకుండా బస్సు సేవలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సోలోమన్ పేర్కొన్నారు.

ముఖ్యంగా బస్సులు బ్రేక్‌డౌన్ అయితే ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు వాహనాల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని మెయింటెనెన్స్ అధికారులను ఆదేశించారు. జాతర సమయంలో భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.