class="wp-singular post-template-default single single-post postid-378 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

తన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ద్వారా అశ్లీల కంటెంట్ వ్యాప్తిపై కేంద్రం ఇచ్చిన నోటీసులకు సోషల్ మీడియా వేదిక X స్పందించింది. అశ్లీల కంటెంట్ నియంత్రణలో లోపాలు ఉన్నట్లు అంగీకరించిన సంస్థ, భారతీయ చట్టాలకు లోబడి పనిచేస్తామని హామీ ఇచ్చింది.

కేంద్ర ఐటీ శాఖ నోటీసుల అనంతరం 3,500కు పైగా అశ్లీల పోస్టులను తొలగించి, దాదాపు 600 ఖాతాలను డిలీట్ చేసింది. మహిళలు, మైనర్లను లక్ష్యంగా చేసిన అసభ్య కంటెంట్ విషయంలో చర్యలు తీసుకుంటామని తెలిపింది.

భవిష్యత్తులో ఇలాంటి దుర్వినియోగం జరగకుండా చర్యలు చేపడతామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.