class="wp-singular post-template-default single single-post postid-384 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

ఏపీ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ నుంచి సాధారణ రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టింది. గ్రామ, వార్డు సచివాలయాలు, రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేపట్టినా, నెలలు గడుస్తున్నా వేల సంఖ్యలో కార్డులు ఇంకా కార్యాలయాల్లోనే పెండింగ్‌లో ఉన్నాయి.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 లక్షలకుపైగా రేషన్ లబ్ధిదారులు ఉండగా, కర్నూలు జిల్లాలో 49,098 మంది, నంద్యాల జిల్లాలో 35,894 మంది తమ కార్డులను ఇప్పటికీ తీసుకోలేదు. రెండు జిల్లాలు కలిపి సుమారు 85 వేల కార్డులు పంపిణీ కాకుండా ఉన్నాయి.

రికార్డుల ప్రకారం వీరందరికీ కార్డులు మంజూరైనప్పటికీ, లబ్ధిదారులు ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. వలసలు, బోగస్ కార్డులు, అవగాహన లోపం వంటి కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. కార్డులు తీసుకోకపోతే నిజమైన లబ్ధిదారులు ఉచిత రేషన్ కోల్పోయే ప్రమాదం ఉంది.అందుకే పౌర సరఫరాల శాఖ గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టి పెండింగ్ కార్డులపై స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.