class="wp-singular post-template-default single single-post postid-40 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

జమ్మూ కశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఇవాళ స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత 6 రోజుల నుంచి అక్కడ స్కూళ్లను మూసివేశారు.

ఇప్పుడు కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సాంబా, విజయ్పూర్, కథువా, బర్నోటి, లఖన్ పూర్, రాజౌరి తదితర ప్రాంతాల్లో పాఠశాలలను పునః ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.