Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మూడు కేజీల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సారపాక వద్ద ఎస్‌ఐ నాగబిక్షం ఆధ్వర్యంలో చేపట్టిన వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ద్విచక్ర వాహనాన్ని ఆపి పరిశీలించగా, గంజాయి బయటపడినట్లు పోలీసులు తెలిపారు.

పట్టుబడిన గంజాయి ముఠా సభ్యులు ముగ్గురూ ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గంజాయి సరఫరా వెనుక ఉన్న వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.