class="wp-singular post-template-default single single-post postid-488 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 44వ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ రోజురోజుకు మరింత బలపడుతోంది. బీజేపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్న జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లుకు డివిజన్ యువత నుంచి విశేష మద్దతు లభిస్తోంది.

ఈ క్రమంలో జనవరి 26, 2026న 44వ డివిజన్‌కు చెందిన చింతల చెర్వు వంశీ, కోయిల శివ, చింతల చెర్వు శ్రీకాంత్, దొమ్మాటి రాజ్‌కుమార్, ఉదర సాయి తదితరులు అధికారికంగా బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా నూతన సభ్యులకు పార్టీ కండువా కప్పి స్వాగతించిన పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, యువత స్వచ్ఛందంగా బీజేపీ వైపు ఆకర్షితులవడం పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. 44వ డివిజన్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.