class="wp-singular post-template-default single single-post postid-507 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (H-58/200) ఆధ్వర్యంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు KTPS ప్రాంతీయ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా TRVKS రాష్ట్ర ఉపాధ్యక్షులు, KTPS 7వ దశ రీజనల్ అధ్యక్షులు శ్రీ దంచనాల రాంబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యుత్ రంగం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, ఉద్యోగుల సమిష్టి కృషితోనే వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెన్కో కార్యదర్శి ముత్యాల రాంబాబు, KTPS కాంప్లెక్స్‌లోని TRVKS రాష్ట్ర నాయకులు, జెన్కో నాయకులు, రెండు రీజియన్ల నాయకులు, బ్రాంచ్ నాయకులు, ఆర్టిజన్ నాయకులు, BTPS, YTPS నాయకులు మరియు సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.