class="wp-singular post-template-default single single-post postid-517 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: 2 minutes

టెన్త్ తరగతి పూర్తిచేసి ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 572 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అభ్యర్థులు తమకు కేటాయించిన రాష్ట్రం లేదా ప్రాంతానికి సంబంధించిన భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం తప్పనిసరి. దరఖాస్తు ఫీజు SC/ST/PwBD/మాజీ సైనికులకు రూ.50 + GST, జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ.450 + GSTగా నిర్ణయించారు.

ఎంపిక విధానం

ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో

తార్కిక సామర్థ్యం

జనరల్ అవేర్‌నెస్

జనరల్ ఇంగ్లీష్

సంఖ్యా సామర్థ్యం

విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను భాషా ప్రావీణ్యత పరీక్షకు పిలుస్తారు.

వేతనం వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,250/- ప్రాథమిక వేతనం లభిస్తుంది. వేతన శ్రేణి
₹24250 – 840 (4) – 27610 – 980 (3) – 30550 – 1200 (3) – 34150 – 1620 (2) – 37390 – 1990 (4) – 45350 – 2700 (2) – 50750 – 2800 (1) – 53550గా ఉంటుంది.

ఇతర భత్యాలు కలిపి ప్రస్తుతం ఆఫీస్ అటెండెంట్లకు ప్రారంభ స్థూల వేతనం (ఇంటి అద్దె భత్యం లేకుండా) సుమారు రూ.46,029/-గా ఉంటుంది.

దరఖాస్తు తేదీలు

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. RBI ప్రకారం, పరీక్షలు తాత్కాలికంగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 మధ్య నిర్వహించే అవకాశం ఉంది.