వనంలోంచి జనంలోకి వచ్చిన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న భక్తులు పరవశించిపోయారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, గుస్సాడీ నృత్యాలతో గురువారం సాయంత్రం పొద్దుపోయాక సమ్మక్క గద్దెకు చేరుకున్నారు. గోదావరి, పాలవాగు తీరాల్లో—ముఖ్యంగా మంచిర్యాల మరియు రామకృష్ణాపూర్ పరిసర ప్రాంతాల్లో—తల్లుల దర్శనానికి భక్తజనం భారీగా తరలివచ్చారు.
మందమర్రి అంగడిబజార్లోని ఓ భక్తుని ఇంటి నుంచి సమ్మక్క తల్లిని ఆర్కే1ఏ గని సమీపానికి తీసుకొచ్చి, అక్కడి నుంచి భారీ జనసమూహంతో ఊరేగింపుగా జాతర ప్రాంగణానికి తరలించి గద్దెపై ప్రతిష్టించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు వనదేవతలను దర్శించుకున్నారు.
అరటిపల్లిలో గద్దెనెక్కిన తల్లులు
తిర్యాణి మండలం కన్నెపల్లి పరిధిలోని అరటిపల్లి స్టేజీ వద్ద సమ్మక్క–సారలమ్మ జాతర ఘనంగా సాగింది. కోయ పూజారుల ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య సమ్మక్కను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు. తిర్యాణి ఎస్సై వెంకటేశ్ నేతృత్వంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా నేత జువ్వాజి అనిల్ గౌడ్, సర్పంచులు తుమ్రం మాన్కు, వెడ్మ నరేశ్, ఆత్రం శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల–శ్రీరాంపూర్‌లలో ఊరేగింపులు
మంచిర్యాలలో గోదావరి తీరంలోని జాతర ప్రాంగణానికి, అలాగే శ్రీరాంపూర్లో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆలయం సమీపంలోని జాతర వద్దకు—సింగరేణి కాలరీస్ హైస్కూల్ ప్రాంగణం నుంచి—సమ్మక్కను ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు. ఏరియా జీఎం సత్యనారాయణ–అరుణ, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రరావు–కవిత దంపతులు సహా అధికారులు, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
- TG RTC Salary Update: ఉద్యోగులకు వేతన సవరణ శుభవార్తReading Time: < 1 minuteTG RTC ఉద్యోగులకు వేతన సవరణపై శుభవార్త అందింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న 2021 పే రివిజన్ ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్… Read more: TG RTC Salary Update: ఉద్యోగులకు వేతన సవరణ శుభవార్త
- Fuel Supply Update: రాష్ట్రంలో డీజిల్ కొరత లేదు – మంత్రి స్పష్టంReading Time: < 1 minuteతెలంగాణలో డీజిల్ కొరత ఉందన్న వార్తలను సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా సజావుగా కొనసాగుతోందని, ఎలాంటి… Read more: Fuel Supply Update: రాష్ట్రంలో డీజిల్ కొరత లేదు – మంత్రి స్పష్టం
- చిన్న గొడవ… ప్రాణం తీసిన ఘర్షణ…Reading Time: < 1 minuteకామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ వివాదం విషాదాంతానికి దారితీయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.… Read more: చిన్న గొడవ… ప్రాణం తీసిన ఘర్షణ…
- Tourism Vision 2047: తెలంగాణను గ్లోబల్ టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దే భారీ ప్రణాళికReading Time: 2 minutesతెలంగాణలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. 2047 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి… Read more: Tourism Vision 2047: తెలంగాణను గ్లోబల్ టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దే భారీ ప్రణాళిక
- Hyderabad Incident: హైదరాబాద్‌లో యువకుడు టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నంReading Time: < 1 minuteహైదరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నెల్సన్ రాజ్ అనే యువకుడు కల్యాణ్ నగర్… Read more: Hyderabad Incident: హైదరాబాద్‌లో యువకుడు టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం





