దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలుతున్నాయి. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్లు ఈ వారం అనూహ్యంగా దిగజారాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు, అలాగే అమెరికాలో US Federal Reserve అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని త్వరలో నియమించనున్నారనే వార్తలు, Donald Trump ప్రకటనల ప్రభావంతో గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
గత వారం భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఈ వారం పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి 1న గోల్డ్ రేట్లు తగ్గగా, సోమవారం కూడా అదే ట్రెండ్ కొనసాగింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 2 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం ధరలు (10 గ్రాములు)
హైదరాబాద్:
24 క్యారెట్లు – రూ.1,60,570
22 క్యారెట్లు – రూ.1,47,190
విజయవాడ, విశాఖపట్నం:
24 క్యారెట్లు – రూ.1,60,570
22 క్యారెట్లు – రూ.1,47,190
చెన్నై:
24 క్యారెట్లు – రూ.1,62,540
22 క్యారెట్లు – రూ.1,48,990
బెంగళూరు:
24 క్యారెట్లు – రూ.1,60,570
22 క్యారెట్లు – రూ.1,47,190
ఢిల్లీ:
24 క్యారెట్లు – రూ.1,60,720
22 క్యారెట్లు – రూ.1,47,340
వెండి ధరలు (కిలో)
ఢిల్లీ – రూ.3,49,900
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం – రూ.3,19,900
చెన్నై – రూ.3,19,900
బెంగళూరు – రూ.3,49,900
అంతర్జాతీయ మార్కెట్ కదలికలు, డాలర్ బలపడటం వంటి అంశాల కారణంగా రాబోయే రోజుల్లోనూ ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
