class="wp-singular post-template-default single single-post postid-574 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని శివధర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు, ద్వేషపూరిత ప్రసంగాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియను భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మంగళవారం డీజీపీ పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓలు)తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 11న జరిగే పోలింగ్, 13న నిర్వహించే ఓట్ల లెక్కింపు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఎన్నికల సమయంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట అదనపు బలగాలను మోహరించాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందే తప్పుడు ప్రచారంపై కూడా నిఘా పెంచాలని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలపై తక్షణమే చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ఆయన హెచ్చరించారు.