ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు ఆన్లైన్ సేవలను విస్తరిస్తోంది. పాలనలో సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్ద నుంచే సేవలు పొందేలా చర్యలు తీసుకుంటోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సేవల ద్వారా ఇన్కమ్, రెసిడెన్షియల్, కులం వంటి ధృవీకరణ సర్టిఫికేట్లతో పాటు ఆర్టీసీ టికెట్లు, దేవాలయ దర్శనాలు, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
విభిన్న వెబ్సైట్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట లభించేలా ఈ వాట్సప్ గవర్నెన్స్ వ్యవస్థను రూపొందించారు. దీనిని ఎలా ఉపయోగించాలో గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రజలు 9552300009 నంబర్‌కు వాట్సప్‌లో Hi అని మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవలను ప్రారంభించవచ్చు.
మున్సిపల్ శాఖ నుంచి 25 కొత్త ఆన్లైన్ సేవలు
ఇక తాజాగా Andhra Pradesh Municipal Administration పరిధిలోని Commissioner & Director of Municipal Administration (CDMA) మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మొత్తం 25 మున్సిపల్ సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది.
ఈ పోర్టల్ ద్వారా
మ్యారేజ్ సర్టిఫికేట్
ఆస్తి పన్ను చెల్లింపులు
ట్రేడ్ లైసెన్స్
మ్యూటేషన్
ఇలా మొత్తం 25 రకాల సేవలను ఇంటి నుంచే సులువుగా పొందవచ్చు.
సర్టిఫికేట్లకు గడువు ఖరారు
సర్టిఫికేట్ల జారీలో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం స్పష్టమైన టైమ్ లైన్‌ను కూడా నిర్ణయించింది.
మ్యారేజ్ సర్టిఫికేట్ – 3 రోజుల్లో
ట్రేడ్ లైసెన్స్ – 7 రోజుల్లో
ఇంటి పన్ను సంబంధిత సేవలు – 15 రోజుల్లో
ఈ గడువు ముగిసినా సర్టిఫికేట్ జారీ కాకపోతే కారణాలు తప్పనిసరిగా తెలపాలి. దరఖాస్తు రిజెక్ట్ చేసినా స్పష్టమైన రీజన్ ఇవ్వాల్సి ఉంటుంది.
గడువులోగా దరఖాస్తులు క్లియర్ చేయకపోతే అధికారులపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దీంతో దరఖాస్తులు, సర్టిఫికేట్ల జారీలో పారదర్శకత, వేగం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. త్వరలో మరిన్ని సేవలను కూడా ఈ పోర్టల్‌లో చేర్చనున్నట్లు సమాచారం.
ఆన్లైన్లో సేవలు ఎలా పొందాలి..?
cdma.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి
‘Finger Tips’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
Online Services ఎంపికను సెలక్ట్ చేయండి
మీకు కావాల్సిన సేవను ఎంచుకోండి
నగరం / పట్టణాన్ని సెలక్ట్ చేయండి
అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి
దరఖాస్తు మున్సిపల్ కమిషనర్ లాగిన్‌కు వెళ్తుంది
అధికారులు పరిశీలించి సర్టిఫికేట్ జారీ చేస్తారు.
- Indian Railways Alert: ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్నింటి టైమ్ మార్పుReading Time: 2 minutesభారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు సుదూర ప్రయాణాల కోసం భారతీయ రైల్వే సేవలపై ఆధారపడుతుంటారు. రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతంగా… Read more: Indian Railways Alert: ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్నింటి టైమ్ మార్పు
- ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలుReading Time: 2 minutesమన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా మంది పెద్దలు ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగాలని సూచిస్తారు. ఈ అలవాటు చాలా సులభమైనదే అయినా శరీరానికి… Read more: ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..Reading Time: 2 minutesఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. జూన్ నాటికి ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో అధికారులు… Read more: విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..
- Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలుReading Time: < 1 minuteజ్ఞాపకశక్తి అనేది పుట్టుకతో వచ్చే వరం మాత్రమే కాదు; అది సాధన ద్వారా పెంపొందించుకునే నైపుణ్యం. మన మెదడు ఒక కండరం లాంటిదే. సరైన… Read more: Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలు
- Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…Reading Time: < 1 minuteకర్ణాటక రాష్ట్రంలో ప్రేమ వ్యవహారం ఘర్షణకు దారి తీసిన ఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ప్రియుడు నిరాకరించడంతో ఓ యువతి… Read more: Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చమురు కొరత భయం? కేంద్రం స్పష్టీకరణReading Time: < 1 minuteఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో చమురు కొరత ఏర్పడుతుందనే వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో… Read more: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చమురు కొరత భయం? కేంద్రం స్పష్టీకరణ
- Gold Rates: యుద్ధ ఉద్రిక్తతలతో బంగారం పరుగులు… తులం రూ.2 లక్షల మార్కు చేరుతుందా…?Reading Time: < 1 minuteఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలకు చేరుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ బులియన్… Read more: Gold Rates: యుద్ధ ఉద్రిక్తతలతో బంగారం పరుగులు… తులం రూ.2 లక్షల మార్కు చేరుతుందా…?
- యూట్యూబ్‌లో నేర్చుకున్న దొంగతనం: ఖరీదైన బైకులు దోచిన యువకుడు అరెస్ట్Reading Time: < 1 minuteవిలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ ఒక యువకుడిని నేర మార్గం వైపు నెట్టింది. యూట్యూబ్‌లో బైక్ దొంగతనం పద్ధతులు తెలుసుకుని ఖరీదైన వాహనాలను టార్గెట్… Read more: యూట్యూబ్‌లో నేర్చుకున్న దొంగతనం: ఖరీదైన బైకులు దోచిన యువకుడు అరెస్ట్
- చాణక్య నీతి: పిల్లలు విజయవంతులవ్వాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన 4 సూత్రాలుReading Time: < 1 minuteప్రాచీన భారత దేశపు గొప్ప ఆలోచనాపరుడు, దౌత్యవేత్త ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన మార్గదర్శకాలు ఉన్నాయి.… Read more: చాణక్య నీతి: పిల్లలు విజయవంతులవ్వాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన 4 సూత్రాలు









