గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ సీఎం చంద్రబాబుతో అమరావతిలో భేటీ అయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న గేట్స్‌కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.
అనంతరం ఆయన రాష్ట్ర సచివాలయానికి వెళ్లగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు పలువురు మంత్రులు ఘనస్వాగతం తెలిపారు. సమావేశంలో గేట్స్ బృంద సభ్యులు కూడా పాల్గొన్నారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని గేట్స్ సందర్శించి, పరిపాలనలో టెక్నాలజీ వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు.
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అమలవుతున్న ప్రాజెక్టుల విస్తరణపై చర్చించారు. సంజీవని ప్రాజెక్టు పురోగతిని సీఎం గేట్స్‌కు వివరించారు.

