ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి రాశి ఫలాలు
ఫాల్గుణ శుద్ధ పంచమి, తదుపరి షష్ఠి,
ఆదివారం
మేషం:
చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృషభం:
ప్రఖ్యాతులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధన లాభసూచనలున్నవి. నూతన వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్థి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు.
మిధునం:
అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటకం:
ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో తొందరపాటు చేసి ఇబ్బందికి గురి అవుతారు. కొన్ని వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత సంఖ్యగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.
సింహం:
ఇతరుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందదు. దూరప్రయాణం సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు అంతంత సంఖ్యగా సాగుతాయి.
కన్య:
సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలలో అప్రయత్న విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి.
తుల:
వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ పరమైన పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
వృశ్చికం:
గృహ నిర్మాణ పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
ధనస్సు:
చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత సంఖ్యగా ఉంటుంది. బందు మిత్రులతో వివాదాలు కలుగుతాయి.
మకరం:
ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం:
దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తివ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట ఊహించని సమస్యలు ఉంటాయి. సంతాన అనారోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
మీనం:
ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలుReading Time: < 1 minute15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.… Read more: Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ… Read more: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ ఇందిరాదామోదరాయనమఃఓం… Read more: నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితేReading Time: < 1 minuteముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు.… Read more: Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…Reading Time: < 1 minuteఅస్సాంలోని పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. 19… Read more: Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…Reading Time: < 1 minuteఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో ప్రజలు వేడి గాలులు, ఉక్కపోతతో ఇబ్బందులు… Read more: Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధానిReading Time: < 1 minuteనరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. ఈ… Read more: Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్యReading Time: < 1 minuteఅహ్మదాబాద్ లో సోషల్ మీడియా కారణంగా సంభవించిన ఘోర ఘటన కలకలం రేపింది.… Read more: Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…Reading Time: < 1 minuteఫరీదాబాద్ లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 18 నెలల చిన్నారి… Read more: Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









