ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతకు ఒక్క నైపుణ్యం సరిపోదని, మల్టీ స్కిల్స్ ఉన్నప్పుడే ఎక్కువ అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దేలా శిక్షణా విధానం ఉండాలని ఐటీఐ ప్రిన్సిపాల్స్‌కు సూచించారు.
సోమవారం మల్లేపల్లి ఐటీఐలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)లో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరు షార్ట్ టర్మ్ కోర్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలు కలిగిన యువత అందుబాటులో లేరని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని తెలిపారు. అందుకే విద్యార్థులకు ఇండస్ట్రీలకు అవసరమైన స్కిల్స్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఏటీసీలు మరియు ఐటీఐలు భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలతో కూడిన నిపుణులను తయారు చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన కోర్సులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచేందుకు అగ్రి అలైడ్ సెక్టార్‌లో నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
ఈ సందర్భంగా సీఎన్‌సీ మెషీన్ ఆపరేషన్, రోబోటిక్స్, ఈవీ టెక్నాలజీ, 2డీ, 3డీ ప్రొడక్ట్ డిజైనింగ్ వంటి ఆధునిక కోర్సులను ప్రారంభించినట్లు తెలిపారు. జీనోమ్ వ్యాలీలో కూడా ఏటీసీ ఏర్పాటు కోసం కంపెనీలతో చర్చలు జరిపామని మంత్రి వెల్లడించారు.
అదే సమయంలో విదేశాల్లో భారతీయ ఉద్యోగులకు ఎక్కువ డిమాండ్ ఉందని పేర్కొన్నారు. టామ్ కామ్ ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
ఇక కార్మిక శాఖ స్పెషల్ సీఎస్ దాన కిశోర్ మాట్లాడుతూ గతంలో ఐటీఐల్లో అడ్మిషన్లు రెండు వేలలోపే ఉండేవని, ఏటీసీలు ప్రారంభమైన తర్వాత అవి 30 వేల వరకు పెరిగాయని తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా 30 కేంద్రాల ద్వారా 5 వేల మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ట్రైనర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఏటీసీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన రోబోటిక్స్ మరియు ల్యాబ్‌లను పరిశీలించారు.
Disclaimer : ఈ కథనం ప్రజలకు సమాచార ప్రయోజనం కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న వివరాలు అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి రూపొందించబడినవి.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









