ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మంగళవారం తృటిలో ఓ పెద్ద విమాన ప్రమాదం తప్పింది. రన్‌వేపై కదులుతున్న సమయంలో Air India మరియు IndiGo కు చెందిన రెండు విమానాల రెక్కలు ఒకదానికొకటి తాకాయి. ఈ ఘటనను ఇరు విమానయాన సంస్థలు అధికారికంగా ధృవీకరించాయి.
అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిరిండియా, ఇండిగో సంస్థలు వెల్లడించాయి. ఘటన జరగడం విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్తతకు దారి తీసినా, పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిరిండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ముంబై నుంచి Coimbatore కు బయలుదేరాల్సిన AI-2732 విమానం టేకాఫ్‌కు ముందు టాక్సీవేలో వేచి ఉండగా, అదే సమయంలో పక్కగా కదులుతున్న ఇండిగో విమానం రెక్కలు తాకాయి. ఈ ఢీకొన్న ఘటనలో ఎయిరిండియా విమానం రెక్కకు స్వల్ప నష్టం వాటిల్లిందని పేర్కొంది.
భద్రత దృష్ట్యా విమానాన్ని వెంటనే సేవల నుంచి తప్పించి, సాంకేతిక పరీక్షల కోసం నిలిపివేశామని అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దింపి, ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
అలాగే ప్రయాణికులు ఇబ్బందిపడకుండా, వీలైనంత త్వరగా వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేసినట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు, డీజీసీఏ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు సమాచారం.
రన్వేలు, టాక్సీవేల్లో భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని విమానయాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలుReading Time: < 1 minute15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 30 వారాల గర్భంతో బాధపడుతున్న మైనర్‌కు అబార్షన్ అనుమతిపై కేంద్ర… Read more: Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి… Read more: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ ఇందిరాదామోదరాయనమఃఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం అష్టావింశతి మహాయుగే కలియుగం: 5128… Read more: నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితేReading Time: < 1 minuteముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.… Read more: Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…Reading Time: < 1 minuteఅస్సాంలోని పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల యువతి తన తల్లిని హత్య చేసిన కేసు ప్రాంతంలో… Read more: Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…Reading Time: < 1 minuteఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో ప్రజలు వేడి గాలులు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప పగటిపూట బయటికి వెళ్లకుండా చాలామంది… Read more: Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధానిReading Time: < 1 minuteనరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గంగా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించారు. ఈ భారీ ప్రాజెక్ట్ రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం… Read more: Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్యReading Time: < 1 minuteఅహ్మదాబాద్ లో సోషల్ మీడియా కారణంగా సంభవించిన ఘోర ఘటన కలకలం రేపింది. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్టుతో ప్రారంభమైన వివాదం చివరికి 19 ఏళ్ల… Read more: Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…Reading Time: < 1 minuteఫరీదాబాద్ లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 18 నెలల చిన్నారి ప్రాణాలు తల్లి చేతిలోనే కోల్పోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర… Read more: Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









