ఈ-కామర్స్ సైట్లలో పాకిస్థాన్ జెండాలు, సంబంధిత వస్తువుల అమ్మకాలపై నిషేధం విధించినట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు.
‘సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్, Ubuy, Etsy, ఫ్లాగ్ కంపెనీ, ఫ్లాగ్ కార్పొరేషన్ కు నోటీసులిచ్చింది.
పాక్ జెండాలు, సంబంధిత వస్తువులు వెంటనే తొలగించాలని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించమని స్పష్టం చేసింది’ అని పోస్ట్ చేశారు.
