హైదరాబాద్ పాతబస్తీలోని మహారాజ్ గంజ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో నుంచి మంటలు ఎగసిపడుతుండగా అందులో సుమారు 10 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఇంటి పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోడౌన్ కు సైతం మంటలు అంటుకున్నాయి. రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపు చేస్తున్నారు.
